ఎన్ఆర్ఈజీఎస్ పనుల బిల్లులు చెల్లించకపోవడం బాధాకరం

0 14

– కలెక్టర్లకు విన్నవించిన టిడిపి నాయకులు

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

టిడిపి హయాంలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడం బాధాకరమని టిడిపి నాయకులు కలెక్టర్ ముందు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  కుట్రపూరితంగా నే ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టు చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన చిన్నాచితకా కాంట్రాక్టుల తో పాటు, బడా కాంట్రాక్టర్లు సైతం అధికశాతం వడ్డీలకు అప్పులు చేసి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన ప్పటికీ ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లు విషయంలో స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది తెచ్చిన అప్పు కట్టేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు .వారిలో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నట్లు తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు గ్రామీణ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్, నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి , మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: NREGS It is painful not to pay work bills

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page