ఏజెన్సీలో పొంగుతున్న వాగులు

0 14

ఏలూరు  ముచ్చట్లు:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరిజిల్లా లోని ఏజెన్సీ ప్రాంతం లోని పలు మండలాల్లో గల కొండ వాగులు, అలివేరు,జల్లేరు, అశ్వారావుపేట వాగులు, పొంగి పొర్లుతున్నాయి. జీలుగుమల్లి, బుట్టాయిగూడెం, మండలాలకు సంబంధించిన పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరుకుల కోసం గిరిజనులు , గిరిజనేతరులు మండల కేంద్రాలకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కొండ వాగులు రహదారుల పై ప్రవహించటం వలన  వైద్య అవసరాల  కోసం జంగారెడ్డి గూడెం వెళ్లే వారు పలు ఇబ్బందులు పడుతున్నారు.108 వాహనం కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లలేని పరిస్థితి  ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జీలుగుమిల్లి నుంచి బుట్టాయిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వాగులు పొంగడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బుట్టాయిగూడెం మండలం కాపవరం గ్రామంలో  వేంచేసి ఉన్న  శ్రీ గుబ్బలమంగమ్మ గుడి సమీపంలోని అలివేరు వాగు  ఉధృతం గా ప్రవహిస్తోంది.  గుబ్బల మంగమ్మ ఆలయన్ని మూసివేయను న్నట్లు  ఆలయ కమిటీ తెలిపారు. ఆలయనికి వెళ్లే రహదారి ని కూడ మూసి వేయడం జరిగింది పరిసర ప్రాంతాలలో ప్రజలు,   అప్రమత్తంగా ఉండాలని పోలీసులు,  అధికారులు, ప్రజలను కోరుతున్నారు.

 

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

- Advertisement -

Tags:The overflowing ditches in the agency

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page