కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ19 నుంచి ప్రారంభం

0 31

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, హైకోర్టులో ఈనెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:The unlock process in the courts starts from the 19th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page