క్వారీ అక్రమాలపై ఏపీ సర్కార్‌ ఫోకస్..

0 8

అమరావతి ముచ్చట్లు:

 

మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో.విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది.డ్రోన్లు, జీపీఎస్‌ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి..ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు.అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది.సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది.విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు. విజిలెన్స్, మైన్స్, సర్వే శాఖ, కాలుష్య నియంత్రణ మండలి టీమ్‌లతో సోదాలు చేయనున్నారు.ఏజెన్సీతో పాటు అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టబోతున్నారు.వివాదాస్పదంగా మారిన లేటరైట్, గ్రానైట్ గనుల అక్రమాల లెక్కలు.అణాపైసలతో సహా బయట పెడతామంటున్నారు అధికారులు.మంగళవారం నుంచి ఈ తనిఖీలు ప్రారంభంకానున్నాయి. లేటరైట్‌ తవ్వకాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు.మంత్రి పెద్దిరెడ్డి. లేటరైట్‌కు బాక్సైట్‌కు మధ్య టీడీపీకి తెలియదన్నారు.మంత్రి పెద్దిరెడ్డి. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూడడం తగదన్నారు.అనకాపల్లిలో అక్రమ మైనింగ్‍ చేసినట్టు గనులశాఖ నిర్ధారించి, జరిమానా విధించిన నాలుగు భారీ క్వారీల్లో సిఐడీ విచారణ చేపట్టింది.ఇక్కడ జరిగిన తవ్వకాలు అక్రమమని నిర్ధారిస్తే.ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: AP govt focuses on quarry irregularities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page