ఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి

0 11

– ఆస్పత్రిలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
– 100 పడకల నుండి 500 పడకల వరకు పెంచాలి
– రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ , ప్రిన్సిపల్ సెక్రెటరి, రాష్ట్ర ప్రజా ఆరోగ్య డైరెక్టర్ కు సీపీఐ వినతి

పెద్దపల్లిముచ్చట్లు:

- Advertisement -

గోదావరిఖని ప్రాంతానికి విచ్చేసిన రాష్ట్ర కుటుంబ ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సయ్యద్ అలీ మూర్తజార్జివి సీనియర్ అధికారి, రాష్ట్ర ప్రజా ఆరోగ్య డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఖనికి విచ్చేసిన సందర్భంగా సోమవారం రోజున రాత్రి మిలినియం హాల్లో కలిసి సీపీఐ  ద్వారా ఖని ఆస్పత్రి అభివృద్ధి గూర్చి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ మాట్లాడుతూ  గోదావరిఖని అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న తరుణంలో అనేక పరిశ్రమలు ఉన్నందువలన ఈ ప్రాంతంలో ప్రజలకు అనకులంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగిందన్నారు. అదే విధంగా ఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో  ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఖాళీ స్థలంలో ఉన్న 9 ఎకరాల విస్థిరణంలో  మాత శిశు సంరక్షణ కేంద్రం (ఎమ్ సి హెచ్ ) 150 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని   విన్నవించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలో ప్రజలకు అనగుణంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం నిరుపేదలు వస్తుంటారు,  ఇందులో భాగంగా గర్భిణి స్త్రీల కేసులు ఎక్కువగా నమోదు అవుతుంటాయి. కేవలం ఈ జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుండి మరియు ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా మన గోదావరిఖని ఆస్పత్రికి వచ్చి డెలివరి చేపిచుకుంటారు అని తెలిపారు. మాత శిశు కేంద్రం ఏర్పాటు చేయాలని, దానికి సంబందించిన ఆర్థిక శాఖ నుండి నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నాము. అదే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. అదే విధంగా ఆస్పత్రిలో సిటి స్కాన్ లేక అనేక మంది పేద, మధ్య తరగతి రోగులు, ప్రజలు ప్రయివేటు సిటీ స్కాన్ కేంద్రాలను ఆశ్రయించి ఆర్ధికంగా నష్టపోతున్నారని కావున రోగులను దృష్టిలో పెట్టుకొని సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఆస్పత్రికి కేవలం ఒక 108 వాహానం మాత్రమే ఉన్నది . నాలుగు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో మరోక 108 వాహానాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని , రోగుల తాకిడికి ఆస్పత్రిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున అప్ గ్రేడ్ చేయాలని కోరమని తెలిపారు. 100 పడకల ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బంది నిరంతరం రోగులకు అండగా ఉంటు వైద్యం అందిస్తున్న సరైన సిబ్బంది డాక్టర్స్, నర్సులు, రేడియాలజిస్టు, గైనకాలజిస్టులు, ల్యాబ్ టెక్నిషియనులు, వార్డు బాయ్లు తదితర సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారని, కావున ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారికి విన్నవించడం జరిగిందన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కుమార్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:A medical college should be established in the mine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page