చిత్తూరు-మల్లవరం ఆరు లైన్ల  రహదారి పూర్తి చేయడానికి సహరించండి   – జిల్లా కలెక్టర్

0 23

తిరుపతిముచ్చట్లు:
చిత్తూరు (కుక్కలపల్లి) – సి. మల్లవరంఆరు లైన్ల 140 నెంబరు  జాతీయ రహదారి పనులు  త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని, పనులకు ఆటంకం లేకుండా  రైతుల భూములు, ,ఇళ్లస్థలాల సమస్యలు సంబంధించిన వారికి  కొలతల్లో తేడాలు వుంటే మరో మారు పరిశీలించి  తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణ అన్నారు. మంగళవారం  ఉదయం నుండి మధ్యాహ్నం వరకు  ఆరు  లైన్ల రహదారిలో కోర్టులను ఆశ్రయించిన రైతులతో , గృహాలు కోల్పోతున్న వారితో జిల్లా కలెక్టర్ , తిరుపతి ఆర్. డి. ఓ.  కనకనరసా రెడ్డి  , సంబంధిత తహసీల్దార్ల సమక్షంలో సమస్యలపై,  పరిహారంపై  పెండింగ్ లో వున్న ఆయా ప్రదేశాలలో  చర్చించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిహారం విషయంలో ప్రభుత్వ పరంగా మీకు న్యాయం జరిగేలా చూస్తానని, భూములు, ఇళ్ళు  కోల్పోతున్నవారి కొలతల విషయంలో నమోదు సమయంలో   తేడా వున్నా, అనుమానం వున్నా  మరోసారి వ్రాత పూర్వకంగా సమస్యలు తెలపాలని, పరిష్కరించడానికి సిద్దంగా వున్నామని  అన్నారు.   ఇప్పటికే రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి,  90% పైగా పూర్తి అయిన రహదారిలో , చిన్న సమస్యలతో 61 కి.మీ.లలో 10 కి.మీ లు రహదారి నిర్మాణం ఆలస్యం  కావడం ప్రజా ప్రయోజనాల  దృష్ట్యా భావ్యంకాదని అన్నారు.  కోవిడ్ కారణంతో ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, కోర్టు కేసులు వల్ల పనులు ఆలస్యమైందని తెలిపారు.  చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి, బొడింబాయి వద్ద కోర్టులో కేసులు వేసి వున్నరైతులతో మాట్లాడటం,  కృష్ణాపురం  వద్ద ఇళ్ళు కట్టుకున్నట్టుకుంటున్న వారి కోరిన మేరకు  విద్యుత్ లైన్లు ఏర్పాటు , పనపాకం వద్ద రైస్ మిల్లు వారి  పరిహారం విషయం , సబ్ స్టేషన్ మార్పు, ఇరుగుశెట్టి వారిపల్లి గృహాల కోసం ఆలస్యంలేకుండా కల్ రోడ్ పల్లి వద్ద  ఇంటి స్థలం,  ఇళ్ళు మంజూరు వంటివి పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చి జాతీయ రహదారికి సహకరించాలని కోరారు. రైతులు కోరిన మేరకు జాతీయ రహదారికి ఆనుకొని వున్న రవణప్పగారిపల్లి  వద్ద స్వర్ణముఖి కాలువ  విషయంలో కె. ఎన్. ఆర్. కంస్ట్రక్షన్ వారు జాగ్రత్తలు తీసుకొని ఫ్లడ్ వాల్ ఏర్పాటు చేయాలని, రైతుల భూములు వర్షాలవల్ల భూమి  కోతలకు గురికాకుండా చూడాల్సిన  బాధ్యత  మీపై  వుందని, గతంలో ఇలాంటి చోట నెల్లూరు వద్ద ఫ్లడ్ వాల్ ఏర్పాటు చేయక పోవడం రోడ్డు కుంగటం జరిగిందని,  అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తతో , న్యాణ్యతతో  ఫ్లడ్ వాల్ నిర్మాణంలో  తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.  పాకాల మండలం సామిరెడ్డి పల్లివద్ద ఇంటి విషయం కోర్టు కేసు వేసిన  వ్యక్తులతో  సహరించాలని ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పర్యటన లో చంద్రగిరి తహసిల్దారు వెంకటేశ్వర్లు, పాకాల తహసిల్దారు భాగ్యలక్ష్మి , ఆర్. ఐ. లు మోహన్ రెడ్డి, జగన్, కె .ఎన్. ఆర్. కంస్ట్రక్షన్  ప్రతినిధులు వినోద్, వెంకటేష్ అధికారులు వున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Continue to complete the Chittoor-Mallavaram six-lane road
– District Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page