జాతికి ద్రోహం చేయాలని చూస్తే, ఉపేక్షించేది లేదు – ఖబడ్దార్  అఖిలపక్ష మైనారిటీ నేతలు

0 10

నెల్లూరు  ముచ్చట్లు:
తమ స్వలాభం కోసం ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదు ఖబడ్దార్ అంటూ అఖిలపక్ష  మైనార్టీ నేతలు వివాదాస్పద స్థలం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సోమవారం నిరసన చేసినా సరే, తిరిగి పనులు ప్రారంభించడంతో మంగళవారం మరల అఖిలపక్ష మైనార్టీ నేతలు అందరూ కలిసి వివాద స్థలానికి చేరుకునీ దీక్ష చేపట్టారు.
విషయం తెలుసుకున్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులు తక్షణమే అఖిలపక్ష మైనార్టీ నేతలు చేస్తున్న దీక్ష స్థలానికి చేరుకున్నారు.నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకునే వరకు పనులు ప్రారంభించమని హామీ ఇచ్చారు.అనంతరం అధికార వైసీపీ పార్టీ నాయకులు దీక్షా స్థలానికి చేరుకొని, అధికారులకు కొమ్ము కాస్తు, సమస్యను తప్పుదోవ పట్టించబోయారు.సమస్య తప్పుదోవ పడుతుందని గ్రహించిన అఖిలపక్ష మైనారిటీ నేతలు అందరూ, గో బ్యాక్ – గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి వారిని వెనక్కి పంపించేశారు.ముస్లిం మైనారిటీ జాతికి ద్రోహం చేయాలని ఎవరు వచ్చినా, తమ స్వలాభం కోసం ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.పై కార్యక్రమంలో లో సాబీర్ ఖాన్,  జియావుల్ హక్, షబ్బీర్, హయాత్ బాబా, మౌలానా అజీజ్, రషీద్, మైనుద్దిన్, ఆషిక్ అలీ ఖాన్, అబ్దుల్ గనీ, ఉమర్ ఫారూఖ్, షహుల్,  ముఫ్తీ అబ్దుల్ రెహమాన్, హమీద్, అశ్లాం, ముజాహిద్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Looking to betray the race, there is nothing to ignore
– Khabaddar All-Party Minority Leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page