జిల్లా నూతన ఎస్పీగా   రవీంద్రనాథ్ బాబు బాధ్యత స్వీకరణ

0 10

కాకినాడముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఎమ్. రవీంద్రనాథ్ బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లా కు బదిలీపై వచ్చారు. కాకినాడ లోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి  జిల్లా ఎస్పీగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డి .జి పి గౌతమ్ సవాంగ్ లకు  కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
ముఖ్యంగా మహిళా సమస్యలపై దృష్టిసారించి వారికి అండదండలుగా ఉండి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు.మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ని కలెక్టరు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Rabindranath Babu takes over as the new SP of the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page