టీ కాంగ్రెస్ లో  కీలక నేతలు

0 14

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పలువురు టీఆర్ఎస్ నేతలు మంగళవారం సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై వారు ఆసక్తి చూపారు. వీరిలో భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు.. ధర్మపురి సంజయ్, మహబూబ్‌నగర్ జిల్లా నేత ఎర్ర శేఖర్ తదితరులు త్వరలో కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాక, పలువురు బీజేపీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో నేతలు మీడియాతో మాట్లాడారు. త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరతామని అన్నారు.రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించానని ధర్మపురి సంజయ్‌ చెప్పారు. ‘‘కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేను.. మా నాన్న కోసమే టీఆర్ఎస్‌లో చేరా. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నా. త్వరలో ఢిల్లీ వెళ్లి పెద్దల సమక్షంలో పార్టీలో చేరతా’’ అని ధర్మపురి సంజయ్ అన్నారు.హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసిన ఎర్ర శేఖర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరతానని వెల్లడించారు. రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని గండ్ర సత్యానారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వేళ వీరు ఆయనతో సమావేశమై కాంగ్రెస్‌లో చేరుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:Key leaders in the Tea Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page