టీ కాంగ్రెస్ లో మాటల మంటలు

0 21

హైదరాబాద్ ముచ్చట్లు:

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బయటికి వచ్చిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం రేగుతోంది. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. కౌశిక్ రెడ్డికి పలువురు నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి స్పందించారు. ‘‘గతంలో రేవంత్ రెడ్డి బూట్లు నాకినోడివి నువ్విప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నావా?’’ అంటూ కాంగ్రెస్ పత్తి కృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘ముమైత్ ఖాన్‌తో రేవంతన్నను పోలుస్తావా బిడ్డా.. నువ్వే శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావు’’ అంటూ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడాడు.కౌశిక్ రెడ్డిపై పత్తి కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ సమీపంలో ఓ పెట్రోల్ బంక్, తిరుమల నగర్‌లో మరో పెట్రోల్ బంక్ కౌశిక్ రెడ్డి లీజుకు తీసుకున్నాడని వివరించారు. ‘‘25 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ అయిపోయి ఆ పెట్రోల్ బంక్‌లు మూత పడ్డాయి. అత్తాపూర్ పెట్రోల్ బంక్ వద్ద 25 గుంటల ప్రభుత్వ స్థలం కౌశిక్ కబ్జా చేసి కుక్కల ఫామ్ పెట్టాడు. ఆ ఆస్తులను కాపాడుకోడానికే టీఆర్ఎస్‌లో చేరుతున్నాడు.’’ అని ఆరోపించారు. ఇలాంటి వారు ఇప్పుడు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలి’ అని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.‘నువ్వు, నీ ఆన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవం కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీకు టికెట్ ఇస్తా అని చెప్పాడా, అప్పుడు నీ వయస్సు ఎంత, చెడ్డీలు కూడ వేసుకోలేదు బిడ్డా. నీకు రూ.61 వేల ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నావు. నువ్వు ఒక్కడివి పోటీ చేస్తే ఓట్లు వచ్చాయా.. మేము అందరం పని చేస్తే ఓట్లు వచ్చాయా? కేసీఆర్ గురించి నీకు తెలవదు. బొక్క బోర్లా పడతావు. హుజురాబాద్‌కు నువ్వు వస్తే టమాటాలు, కోడిగుడ్లతో కొడతారు.’’ అంటూ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Tea fires in Tea Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page