డిజిటల్ విద్యావిధానంపై సమీక్షలు

0 8

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్‌ ఎడ్యుకేషన్‌’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్‌ డిజిటల్ ఎడ్యుకేషన్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌డీఈఏఆర్‌), స్వయం సహా ఇతర కార్యక్రమాలను కూడా సమీక్షించారు.విద్యలో సాంకేతికత ఆవశ్యకతను వివరించిన ప్రధాన్‌ దూర, సమగ్ర విద్యా లక్ష్యాలను సాధించేందుకు సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.విద్యారంగంలో శక్తిమంతమైన డిజిటల్ వ్యవస్థ విద్యార్థుల అభ్యాసనఅవకాశాలను విస్తరించడం తోపాటు,ఆవిష్కరణలు,విద్యాలయాల స్థాపనను పెంచుతుందని ఆయన అన్నారు. డిజిటల్‌ మాధ్యమం దిశగా అడుగేలేయాల్సిన అవసరాన్ని కొవిడ్‌ సృష్టించిందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. దేశంలో విద్యాభోధన ఆగకుండా కేంద్ర విద్యా శాఖ చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమాలు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, విద్యావ్యవస్థను మరింత ముందుకు తీసికెళతాయని ధర్మేంద్ర ప్రధాన్‌ భరోసా ఇచ్చారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Reviews on digital education

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page