దలైలామ పుట్టిన రోజు వేడుకలు..చొచ్చుకొస్తున్న సైన్యం

0 14

న్యూఢిల్లీ   ముచ్చట్లు:
భారత్‌లోని గ్రామాల్లో బౌద్ధ గురువు దలైలామా జన్మదిన వేడుకలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చైనా దళాలు లడఖ్‌లోని దెమ్‌చోక్‌లోకి చొరబడ్డాయి. భారత్ వైపున సింధు నదిని దాటి వచ్చి చైనా జెండాలు, బ్యానర్లను ప్రదర్శించినట్టు మీడియా నివేదికలు వెల్లడించారు. గతవారం లడఖ్‌లోని పెద్ద సంఖ్యలో ఉన్న బౌద్ధులు దలైలామా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. లేహ్‌లోని శీతాకాలపు విడిది కేంద్రం నిరంతరం సంసిద్ధంగా ఉంటుంది. భారత్‌లోని గ్రామాల్లో దలైలామా జన్మదిన వేడుకలు జరుపుకోవడంపై చైనా అభ్యంతరం చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.తాజా పరిణామాలు ఆధ్మాత్మిక, విదేశాంగ విధానాలకు సరికొత్త చిక్కులను తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దలైలామా జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గత మంగళవారం ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మోదీ బహిర్గతం చేయడం ఇదే తొలిసారి. భారత్-చైనా సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.చైనా నిరసనలపై స్పందించడానికి భారత్ నిరాకరించింది. చొరబాట్లను తీవ్రంగా పరిగణించలేదు కానీ, ఇది చైనా దుందుడుకు వ్యూహాంలో భాగమని స్పష్టమవుతోంది. దెమ్‌చోక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భారత సైన్యం పెట్రోలింగ్‌ను చైనా అడ్డుకుంటోంది. భారత-చైనా సైనిక చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన జూలై 6 న దేమ్‌చోక్‌కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయుల్ సమీపంలోని డోలీ టాంగో వద్ద చోటుచేసుకుంది.భారత భూభాగంలోకి చొరబడిన చైనా దళాలు.. 30 నిమిషాల పాటు తిష్టవేసినట్టు తెలుస్తోంది. దలైలామాపై చైనా తన ఆగ్రహాన్ని ఎల్లప్పూడు వెళ్లగక్కుతుంది. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 86 వ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చైనాకు మింగుడుపడలేదు. దలైలామాతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దలైలామాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలనిఆశిస్తున్నామని అన్నారు ఇదిలా ఉండగా, జులై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశాధినేత జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కానీ, దీనికి మూడు రోజుల ముందే చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నా కేంద్రం కానీ, దేశంలోని సీపీఎం తప్పా మరే రాజకీయ పార్టీగాని శుభాకాంక్షలు చెబుతూ చిన్న సందేశం కూడా పంపలేదు. కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు కనీసం చిన్న మెసేజ్ కూడా పంపకపోవడం దౌత్య సంబంధాలకు పూర్తి విరుద్ధం.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Dalai Lama’s birthday celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page