దేశ భద్రతలో భాగస్వామ్యులు కండి – ఎంపి రెడ్డెప్ప

0 270

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ప్రతి ఒక్కరు దేశ భద్రతలో భాగస్వామ్యులుకావాలని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపాలిటిలో జెడ్పిమాజి వైస్‌ పెద్దిరెడ్డి, జెడ్పిసీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఓఎస్‌డి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగాలలో నియామకాల కోసం నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి చూపించే కార్యక్రమాన్నిఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈనెల 19న ఆర్మీలో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా గత ఏడాది వివిధ ప్రైవేటు కంపెనీలలో 2500 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆర్మీలో దేశభద్రతలో భాగస్వామ్యులు చేసేందుకు పుంగనూరు నుంచి నిరుద్యోగులను ఎంపిక చేసి, వారికి 60 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలకు పంపే కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. ఎంపి మిధున్‌రెడ్డి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరుద్యోగులు లేకుండ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేశారని తెలిపారు.

 

 

 

- Advertisement -

ఓఎస్‌డి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగులకు వారి చదువును బట్టి ఉపాధి చూపించడం జరుగుతుందన్నారు. అలాగే పుంగనూరులో జగనన్న జాబ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల ఎంపిక నిరంతర పక్రియగా జగనన్నజాబ్‌ కేంద్రంలో నిర్వహిస్తామన్నారు. జెడ్పిసీఈవో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వివిధ రకాల ఉద్యోగాలను కల్పించి, ఆకుటుంభాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి ఎస్వీడిఫెన్స్ అకాడమిలో శిక్షణ ఇచ్చి ఆర్మీ ఉద్యోగాలకు పంపుతామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏలు మునితుకారం, చంద్రహాస్‌, డిపివో దశరథరామిరెడ్డి, సెట్విన్‌ సీఈవో మురళికృష్ణ, డిఎల్‌పివో లక్ష్మి, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ మేనేజర్‌ సరితారెడ్డి, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీమున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ నాయకులు నాగేంద్ర, జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Find Partners in Homeland Security – MP Reddeppa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page