పార్టీ మారే ఆలోచన లేదు

0 9

నల్గొండ  ముచ్చట్లు:
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో నిన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. తనకు ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదన్నారు. రెండు సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్న విషయం వాస్తవమే.. కానీ, కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల ఆధారంగా, కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపై తన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాల తీసుకోవడం మూలంగా తెలంగాణ ఇచ్చిన.. కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోవడానికి కారణం సరైన నాయకత్వం లేకపోవడమే అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు అని మాట్లాడిన మాట వాస్తవమే నన్న ఆయన.. రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయడంతో కార్యకర్తలల్లో నిరుత్సాహం కలిగిందన్నారు. నిర్ణయ లోపం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలహీనపడగా, బీజేపీ పుంజుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఎంపికపై తాను మాట్లాడబోనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:No idea of changing party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page