ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలందరు తరలి రావాలి

0 11

– కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్

పెద్దపల్లి ముచ్చట్లు:

- Advertisement -

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఈ నెల 15న ఒసిపి 5పై జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలందరు తరాలివచ్చి మన నగారాన్ని కాపాడుకునేందుకు మన గొంతును వినపించాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం రాజ్ ఠాకూర్ నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను మరిచి గోదావరిఖనిలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తూ బొందల గడ్డగా మారుస్తున్నరాని అన్నారు. ఎన్నికల ముందు ఓపెన్ కాస్ట్ గనులను రానివ్వం అండర్ గ్రౌండ్ గనులను తీసుకవచ్చి ఉపాధి కల్పిస్తామన్న ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని మరిచారాని ఆరోపించారు. ఈ నెల 15న ఫైయింక్లైన్ వి.టి.సి కేంద్రంలో  సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నగరం బొందల గడ్డ కాకుండా అడ్డుకునేందుకు మా గొంతును వినిపిస్తామని అన్నారు. ఇందుకోసం పట్టణం లోని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. వ్యక్తిగత, స్వలాభం కోసం పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే సహించేందులేదాని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో బొంతల రాజేశ్, పెద్దెల్లి ప్రకాశ్, ఎండీ ముస్తాఫా, గాదం విజయ, ఫకురొద్దిన్, బొమ్మక రాజేశ్, గట్ల రమేశ్, గాదం నందు, ఖాజానాజిమొద్దిన్, బెంద్రం రాజిరెడ్డి, ముక్కెర శ్రీనివాస్, అనుమ సత్యనారాయణ, సమ్మెట స్వప్న, పొన్నం స్వరూప, జగన్, పీక అరుణ్ కుమార్, సల్లు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: All the people should come to the referendum

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page