ప్రాణాలను ఫణంగా పెట్టి కిన్నెరసాని వాగు దాటుతున్న ఆదివాసీలు

0 16

కొత్తగూడెంముచ్చట్లు:

ఆళ్ళపల్లి మండలం నడిమిగూడెం, సజ్జల బోడు, దొంగతోగు గ్రామాలకు చెందిన రైతులు, కూలీలు, ఆయాగ్రామాల ప్రజలు వారిపనికోసం గుండాల మండల కేంద్రానికి వస్తూ  వెళ్తూ ఉంటారు. ఈరోజు పనులకు వెళ్లి వారి గ్రామాలకుతిరిగి వెళ్తున్న క్రమంలో గత నాలుగు రోజులనుండి కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసాని వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.  మోదుగులగూడెం – సజ్జలబోడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులు మధ్యలో ఆగిపోవడంతో గ్రామస్తులు కిన్నెరసాని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది.  వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు వారి ప్రాణాలను పణంగా పెట్టి కర్రల సహాయంతో వాగును దాటుతున్నారు.  ఇకనైనా హై లెవెల్ వంతెన నిర్మాణం చేసి తమ కష్టాలను తొలగించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Tribals crossing the Kinnerasani estuary at the risk of their lives

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page