ప్రేమ వేధింపులకు యువతి బలి

0 10

నల్గోండ  ముచ్చట్లు:
నల్గొండ జిల్లా లో ప్రేమ పేరుతో వేధింపులకు మరో యువతి బలైపోయింది.. ఎంతో సిన్సియర్గా చదువుకునే ఓ విద్యార్థినినీ ప్రేమ పేరుతో వేధింపులు బలిగొన్నాయి.. గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో ఆ యువతిని వేధిస్తున్న నేపథ్యంలోనే.. ఆ యువతి గ్రామంలోని తన నివాస గృహానికి కిలోమీటరు దూరంలో మడి కట్ల లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది విగతజీవిగా కనిపించడం ఆ గ్రామంలో కలకలం సృష్టించింది.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన చింతమల్లప్రీతి(17) అనే యువతి నల్గొండ లోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఒకేషనల్ కాలేజీ లో  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరం చదువుతోంది.. అయితే గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ప్రీతి వెంట పడుతున్నాడని.. పదే పదే ఫోన్లు చేసి విసిగించే వాడని.. తనను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటానని  నమ్మబలికి అందుకే ఫోన్లు చేస్తున్నాడు అని తనను పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాడని ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిపిందని.. ఓ రోజు తమ కుటుంబ సభ్యుల ముందే ప్రీతిని ఇంట్లోకి వచ్చి బెదిరించి చేయి చేసుకొని కొట్టాడని.. నల్గొండలో నీవు వేరే వాళ్ళతో ఎందుకు కతిరుగుతున్నావని నిన్ను ఎలాగైనా చంపేస్తానని ప్రీతిని బెదిరించాడని…. ప్రేమించింది నన్ను నీవు ఇంకొక వ్యక్తి తో ఎలా తిరుగుతావ్ అని గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు బెదిరించాడని .. నిన్ను ఎలాగైనా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 11 గంటలకు ప్రీతి ఉన్నట్టుండి  ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్ళింది.. తన కూతురు ఉన్నట్టుండి రాత్రి కనిపించకుండా వెళ్లేసరికి చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి తాము తెల్లవార్లు  నిద్రపోలేదని తెల్లారేసరికి ఇంటికి దూరంగా ఉన్న మడి కట్ల లో తన కూతురు  విగతజీవిగా పడి ఉందని.. తన కూతురు ప్రీతి చావుకు కారణం పవన్ అని తన కూతురిని నమ్మించి బయటకి పిలిపించి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  ప్రేమ పేరుతో వేధింపులే తన కూతురు ప్రీతి చావుకు కారణం అని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు   జరిగిన ఘటన పై కేతేపల్లి ఎస్ఐ రామకృష్ణను వివరణ అడగగా ఇప్పటి వరకూ తనకు ఫిర్యాదు అందలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Young woman victim to love abuse

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page