భగ్గుమన్న భూతగాదాలు

0 14

వికారాబాద్  ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ తగాదాలు భగ్గుమన్నాయి.పొలం దున్నుతున్న రాములు అనే వ్యక్తిని హరిశ్చందర్ అనే యువకుడు పెద్ద కర్రతో చితకబాదాడు.ఆపబోయిన రాములు భార్యపై అదే కర్రతో దాడి చేశాడు. క్రూరంగా వారిపై దాడిచేసిన విడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్వే నంబర్ 537/11/50 లోని నాలుగు ఎకరాల పొలానికి సంబంధించి కాట్రావత్ రాములు,రాములు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా గొడవ జరుగుతుంది. పొలానికి సంబంధించిన వ్యవహారం  కోర్టు పరిధిలో ఉంది.సోమవారం మధ్యాహ్నం రాములు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా హరిశ్చందర్ అనే యువకుడు తన తండ్రితో కలిసి కర్రతో దాడి చేశాడు. ప్రస్తుతం రాములు అతని భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Bhaggumanna exorcisms

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page