మతిభ్రమించి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి

0 18

-మెట్ పల్లిలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కోరుట్ల  ముచ్చట్లు:

 

- Advertisement -

ఇన్నిరోజులు పార్టీలో ఉండి, నీతి మాలిన రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ బహిష్క్రుత నేత కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. మంగళవారం పట్టణంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కౌశిక్ రెడ్డి తన స్థాయిని మర్చిపోయి టిఆర్ఎస్ నుంచి మెప్పు పొందడానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మాణిక్ ఠాగూర్ను, పార్లమెంట్ ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ను విమర్శిస్తున్నాడన్నారు. టిఆర్ఎస్ వాళ్లు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ను కౌశిక్ రెడ్డి విలేకర్ల ముందు చదువుతున్నాడని ఎద్దేవాచేశారు. టిఆర్ఎస్ నాయకులు చేతున్న ఇలాంటి నీతిమాలిన రాజకీయాలను ప్రజలు విశ్వసించరని అన్నారు. హుజురాబాద్ లో  పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీ చేస్తారన్న ప్రచారం చేయడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పొన్నం ప్రభాకర్ పలుమార్లు పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆయనను విమర్శించడానికి తప్పు పడుతున్నామన్నారు. పొన్నం ప్రభాకర్ అండతోనే ముందుకు వెళ్లి మళ్లీ ఆయనే విమర్శించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుని ఐదు రోజులు అవుతుందని, ఇక హుజురాబాద్ పై దృష్టి పెట్టి ఎన్నికల్లో గెలవడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తారని ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తగా అధికార పార్టీ వైపు తన స్వార్థం కోసమే అడుగులు వేస్తూ రేవంత్ రెడ్డిని, పొన్నం ప్రభాకర్ ను, మాణిక్యను విమర్శించడాన్ని తప్పుబడుతున్నామన్నారు. వెంటనే కౌశిక్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని అన్నారు. మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, కాంగ్రెస్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ రాజారాం, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగ బాలయ్య ,రఫీక్ ,యూత్ నాయకులు కోటగిరి చైతన్య ,మహమ్మద్ అవేజ్, జుబేర్ ,అశోక్, మహమ్మద్ ముఖీం ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Kaushik Reddy talking insanely

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page