రఘురామకు వ్యతిరేకంగా 290 పేజీల డాక్యుమెంట్

0 16

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు షాకిచ్చేందుకు పార్టీ అధిష్టానం రెడీ అయ్యింది. వారం రోజుల్లోనే ఎంపీకి నోటీసులు వస్తాయని రాజమండ్రి వైసీపీ ఎంపీ, లోక్‌సభలో పార్టీ విప్ మార్గాని భరత్ వెల్లడించారు. ఎంపీ రఘురామ వ్యవహరిస్తున్న తీరుపై విసుగు చెంది లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎంపీ రఘురామపై దాదాపు 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు.వారం రోజుల్లోనే ఎంపీ రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నట్లు మార్గాని భరత్ వెల్లడించారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో రఘురామ కృష్ణరాజుపై వేటు వేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణరాజు వెళ్తున్నారని విమర్శించారు.రఘురామ పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల గురించి స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు మార్గాని భరత్ తెలిపారు. రఘురామ చర్యల వల్ల వాలంటీర్‌గా మెంబర్షిప్ కోల్పోయినట్లు అవుతుందన్నారు. గతంలో జరిగిన బిహార్‌కు చెందిన జేడీయూ శరద్ యాదవ్ సంఘటన గురించి కూడా స్పీకర్‌కు వివరించామని పేర్కొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:290 pages document against Raghuram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page