శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు మంజూరు

0 13

హైదరాబాద్‌  ముచ్చట్లు:
సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై కేబినెట్‌ చర్చించింది. సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీధి దీపాల కొరకు అన్ని గ్రామాల్లో మూడో వైర్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే కేబినెట్‌కు పల్లె, పట్టణ ప్రగతిపై పంచాయతీరాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖలు నివేదికలు సమర్పించాయి. రాష్ట్రంలో వైకుంఠధామాలను వందకు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై గ్రామాల్లో వీధి దీపాల కోసం ప్రత్యేకంగా మూడో వైర్‌ను తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Rs.1200 crore has been sanctioned for solving fresh water problem in suburban municipalities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page