శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవం ప్రారంభం

0 20

తిరుపతి ముచ్చట్లు:

 

 

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.సాయంత్రం 6 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని పెద్ద‌శేష వాహ‌నంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. అదేవిధంగా రెండో రోజు బుధ‌వారం హనుమంత వాహనంపై, మూడో రోజు గురువారం గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో  ధ‌నంజ‌యుడు, సూప‌రింటెండెంట్లు ర‌మ‌ణ‌య్య‌,  చెంగ‌ల్రాయ‌లు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్  యోగానంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: The beginning of the celebration of the realization of Sri Kalyana Venkateswaraswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page