సీమలో తమ్ముళ్ల మౌనం

0 21

తిరుపతి  ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ రాయలసీమలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఇప్పుడు నీటి వివాదం ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టేవిధంగా మారింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ గత ఏడేళ్లుగా బలహీనంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ పెద్దగా ఇక్కడ ఫలితాలు దక్కలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది కేవలం మూడు సీట్లే. అవి చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ లు మాత్రమే గెలిచారు.రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలున్నారు. పేరున్న నేతలే పదుల సంఖ్యలో ఉన్నారు. సుదీర్ఘకాలం నుంచి వారు రాజకీయాల్లో ఉన్నవారే. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలి బండ వివాదాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆ ప్రాంతానికి సాగు, తాగు నీటి సమస్య చాలా వరకు తీరుతుంది. అయితే ఇది పూర్తయితే క్రెడిట్ మొత్తం జగన్ కే దక్కుతుంది.ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ముదురుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజీగా మారుతుంది. వైసీపీ రాయలసీమ నేతలంతా గొంతెత్తుకుని అరుస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఈ వివాదం పై నోరు మెదపడం లేదు. తమ ప్రాంతానికి దక్కుతున్న ప్రయోజనాన్ని అడ్డుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై ఏమీ అనలేకపోతున్నారు. ఈ వివాదంపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడమే కారణం.ఈ వివాదం కేసీఆర్, జగన్ లు సృష్టించినవేనన్నది చంద్రబాబు నమ్మకం. తమను మరింత బలహీన పర్చేందుకు వారిద్దరూ ఆడుతున్న గేమ్ గా చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు కొంత కటువుగానే నేతలకు చెప్పారట. దీంతో రాయలసీమ తెలుగుదేశం నేతలు ఈ వివాదంపై మౌనంగానే ఉన్నారు. ఇది తమకు భవిష‌్యత్ లో నష్టం చేకూరుస్తుందని వారు చెబుతున్నారు’

మైనస్..ప్లస్ పై అంచనాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీయే వేరు. ఒకచోట మైనస్ లో ఉన్నా, మరోచోట ప్లస్ లోకి పార్టీని తీసుకెళ్లాలని ఆయన ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను అమలు చేస్తుంటారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. బలమైన నేతలున్నప్పటికీ జగన్ తీసుకుంటున్న చర్యలతో పార్టీకి ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతూ వస్తుంది. కర్నూలుకు న్యాయరాజధానిగా ప్రకటించడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ ప్రాజెక్టుతో జగన్ కు మరింత గ్రాఫ్ పెరిగింది.రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను తనను ఇబ్బంది పెట్టడానికే ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే కనీసం రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ నేతలు కూడా నోరు విప్పకుండా కట్టడి చేయగలిగారు. దీంతో సీమలో టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కు ఆధిక్యత దక్కింది.దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ ను ఇరకాటంలో నెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు జగన్ కు లేఖ రాయడం చంద్రబాబు ఆలోచనే. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను నిలిపేయాలని టీడీపీ ఎమ్మెల్యేల చేత డిమాండ్ చేయిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే ఈ లేఖ రాయడం, జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆ జిల్లాలో పార్టీకి కొంత ప్లస్ అయ్యేలా చంద్రబాబు వ్యూహరచన చేశారంటున్నారు.గత ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాలు దక్కాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండకుంటే ప్రకాశం జిల్లాకు నీళ్లు రావని, ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ , ఓటు బ్యాంకు ఉండటంతో కనీసం దానినైనా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల చేత లేఖ రాయించారన్న టాక్ వినపడుతుంది. మొత్తం మీద ఒక చోట మైనస్ అయినా మరోచోట ప్లస్ అయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Silence of siblings in Europe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page