అంగన్ వాడీ టీచర్ పై సర్పంచ్ భర్త వేధింపులు

0 27

జాబ్ ఉండాలంటే నేను చెప్పినట్లు చేయాలి
తన కోరిక తీర్చడంతో పాటు కాళ్ళు మొక్కితే వదిలేస్తా అంటూ వేధింపులు
ముధోల్ పోలీస్ స్టేషన్ లో వేధింపులు, అట్రాసిటీ కేసు నమోదు
నిర్మల్   ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర గ్రామ సర్పంచ్ లావణ్య భర్త తనను లైంగిక వేదిస్తున్నదంటూ అంగన్ వాడి టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ముధోల్ పోలీస్ స్టేషన్లో వేధింపులు, అట్రాసిటీ కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అంగన్ వాడి టీచర్ గా పని చేస్తున్న రేఖా, సర్పంచ్ భర్త కిష్టయ్య మధ్య వార్ నడుస్తుంది. అయితే టీచర్ రేఖా అంగన్ వాడి కేంద్రంలో అక్రమాలకు పాల్పడిందంటూ గ్రామసభలో చర్చించారు. ఈ విషయమై సర్పంచ్ భర్త కిష్టయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నానని, వారు వస్తే నీ జాబ్ పోతుందని, లేదా నా కోరిక తీర్చితే వదిలేస్తానంటూ వేధించ సాగాడు. దింతో టీచర్ రేఖా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  కానీ సర్పంచ్ భర్త కిష్టయ్య మాత్రం మరో రకంగా చెబుతున్నాడు. తాను టీచర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, కక్ష పూరితంగానే కేసు నమోదు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని చెబుతున్నాడు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Sarpanch’s husband harasses Anganwadi teacher

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page