అప్పన్నను దర్శించుకున్న హరిబాబు

0 25

విశాఖపట్నం ముచ్చట్లు:

 

మిజోరం నూతన గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు  సతీ సమేతంగా .. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు.  ఆలయ అధికారులు డీఈఓ సూజత గారు, ఏఈఓ రాఘవ కుమార్, ట్రస్టుబోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు  ఘన స్వాగతం పలుకుతూ, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. తనను గవర్నర్ గా నియమించినందుకు… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు హరిబాబు. ఈశాన్య రాష్ట్రాల్లోని  మిజోరం ప్రగతికోసం స్వామివారి ఆశీస్సులు కోరారనని హరిబాబు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్లడానికే సింహాచలం వచ్చానని చెప్పుకొచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం … మన సింహాచలం శ్రీవరాహనరహసింహస్వామన్నారు.  ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను హరిబాబుకు అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు వివరించారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Haribabu visiting his father

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page