ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం

0 29

తిరుపతిముచ్చట్లు:

 

కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ జులై 16 నుండి 24వ తేదీ వ‌రకు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగాన్ని టిటిడి త‌ల‌పెట్టింది. ఇందుకోసం జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌రకు విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అనుజ్ఞ‌, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

- Advertisement -

ఈ 9 రోజుల పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో అర్చ‌న‌లు, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. చివ‌రిరోజు జులై 24న ఉద‌యం 10.30 నుండి 11 గంటల వ‌ర‌కు మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, ఉద‌యం 11 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల(ఇద్ద‌రు) కోసం టికెట్ ధ‌ర రూ.1001/- గా నిర్ణ‌యించారు. వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనే గృహ‌స్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్ ద్వారా ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం గృహ‌స్తుల‌కు ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అమ్మ‌వారి అక్షింత‌లు అంద‌జేస్తారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Koti Mallepushpa Mahayagam with Kanakambara with online virtual system

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page