కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

0 21

మాతృమూర్తికి    కాళ్లు కడిగి పూలాభిషేకం చేసిన  కుటుంబ సభ్యులు
ఖమ్మం  ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా తల్లాడ కు చెందిన దారా సుబ్బమ్మ  కు ఇటీవల వందేళ్లు నిండాయి  జూన్ 26 వ తారీఖున సుబ్బమ్మకు కరోనా   సోకడంతో కుటుంబీకుల హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో  వైద్య చికిత్సలు చేయించారు  దీంతో కరోనానుంచి కోలుకోవడంతో  మాతృమూర్తికి కుటుంబీకుల  పూల అభిషేకంతో ఘన స్వాగతం పలికి   మానవత్వాన్ని చాటుకున్నారు
ఖమ్మం జిల్లా తల్లా డకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దారా విష్ణు మోహన్ రావు తల్లి దారా సుబ్బమ్మ కరోనాను జయించింది. వందేళ్ల వయసులో ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఆమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కార్పోరేట్  ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కరోనాను జయించి తిరిగి వచ్చింది.  ఆమె స్వగృహానికి వస్తున్న సందర్భంగా ఆమె కుమారుడు దారా విష్ణు మోహన్ రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సుబ్బమ్మకు పెద్ద అక్షరాలతో పూలతో ఇంటి ముందు స్వాగత తోరణాలు అలంకరించారు. అదేవిధంగా ఇంటికి వచ్చిన సందర్భంగా విష్ణు మోహన్ రావు దంపతులు ఆ తల్లి కాళ్లు కడిగి పూలాభిషేకం చేశారు. కుటుంబ సభ్యులందరూ  ఆమెకు స్వాగతం చెబుతూ పూలాభిషేకం చేశారు.  ఈ విధంగా ఏర్పాట్లు చేయడంతో ఆ బామ్మ సంతోషానికి హద్దులు లేకుండా  పోయింది. కరోనాను జయించి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపించాలని, వారిని వృద్ధాప్యంలో మంచిగా పోషించాలని మంచి సందేశాన్ని ప్రజలకు అందించడంతో మోహన్ రావు ను ఈ సందర్భంగా స్థానికులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Centennial grandmother who conquered Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page