కౌన్సిలర్ ఇల్లు ముట్టడి

0 5

మేడ్చల్  ముచ్చట్లు:

 

- Advertisement -

ఘట్కేసర్ మున్సిపాలిటీకి  చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తన పదవికి రాజీనామా చేయకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బుధవారం  ఘట్కేసర్ మున్సిపల్,  మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌన్సిలర్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్,  మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  ఓ బీసీసెల్ వైస్ చైర్మన్,  కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్ లు పాల్గోన్నారు. అందోళన సందర్బంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ పోలీసులను అడ్డంపెట్టుకుని భగ్నం  చేయడానికి ప్రయత్నించి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసారని వారు ఆరోపించారు. హరి వర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ పార్టీకే కాకుండా వారి పదవికి రాజీనామా చేసి  వెళ్లి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని అన్నారు.  మళ్లీ ప్రజల వద్దకు వచ్చి గెలవ వలసిందిగా ఛాలెంజ్ చేసారు.  ఈ నిరసన కార్యక్రమంలో బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు  మరియు ఘట్కేసర్ మున్సిపల్ మండల కాంగ్రెస్ పార్టీ   ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:Councilor house siege

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page