ఖాళీ పోస్టులు భర్తీ చేసే వరకు పోరాడుతాం-విద్యార్థి యువజన సంఘాలు

0 6

ఆదోని  ముచ్చట్లు:

పట్టణంలో భీమ సర్కిల్  నందు ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల  అధ్యక్షతన రిలే నిరాహారదీక్ష  నిర్వహించారు.ఈ దీక్షా కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా , మాజీ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మన్న ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 18వ తేదీ విడుదల చేసిన జాబ్ లెస్ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల 40 వేల ఉద్యోగాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను నట్టేట ముంచింది అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 24 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థి యువజన సంఘాలు నాయకులు శ్రీనివాసులు , వీరేష్ , తేజ, రమేష్, తిరుమలేశ్ , గిరి , సోమశేఖర్ సూర్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసింది అని ఎద్దేవా చేశారు, నిరుద్యోగుల జోలికొస్తే జగన్మోహన్రెడ్డికి ఇంటిదారి తప్పదని వారు హెచ్చరించారు. వారిచ్చిన ఉద్యోగాల విప్లవంలో కేవలం 10143 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లో పెట్టి విప్లవం అంటే ఏ విధంగా విప్లవం అవుతుందని ప్రశ్నించారు. కావున నిరుద్యోగులు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 40 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 24 లక్షల ఉద్యోగాలు కూడా తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ ,ఈ దీక్షలకు టిడిపి , సిపిఎం , సిపిఐ , నాయకుల మద్దతు ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్న నిరుద్యోగులు పాల్గొన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:We will fight until the vacant posts are filled — student youth associations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page