డీజీపీ మాటలు ప్రకటనలకే:ఎమ్మెల్యే రాజాసింగ్

0 30

హైదరాబాద్   ముచ్చట్లు:
బక్రీద్ కోసం ఆరోగ్య వంతమైన ఆవులు.. ఎద్దు లను అమ్ముతున్నారు. ఓల్డ్ సిటీలో ఆరోగ్య వంతమైన ఆవులు.. ఎద్దుల ను అమ్మకుండా డీజీపీ స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.  వెటర్నరీ డాక్టర్ తో ఆ ఆవులు .. ఎద్దులను పరీక్షించాలి. ఎలా వాటిని ఓల్డ్ సీటీలో అమ్ముతున్నారని అన్నారు.డీజీపీ మాటలు పత్రికా ప్రకటనకు పరిమితం అయ్యాయి. ఆయన ఆదేశాలు ఎక్కడ అమలు కావడం లేదు. అసదుద్దీన్ ఎంపీ నియోజకవర్గంలో.. బలాల నియోజకవర్గంలో మంచి మంచి ఎద్దులను రోడ్డుపై పెట్టి యాదేచ్చగా అమ్ముతున్నారు. ఎంఐఎంను కుషీ చేయడానికి డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చారని పిస్తుంది. ఎద్దులను.. ఆవులను కోయోద్దంటూ ఆదేశించినా అమలు కావడం లేదు. చిన్న లేగలు.. ఎద్దులను కోసుకోవచ్చని అని ఎవరు చెప్పారని అయన ప్రశ్నించారు. హోం మంత్రి అలాంటి ఆదేశాలు ఏమైనా జారీ చేసారా.  సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఎందుకు పాటించడం లేదు. ఓల్డ్ సిటీలో శాంతిభద్రతల సమస్యలు వచ్చేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా లేగలు .. ఎద్దులను చంపకుండా ఆదేశించమని డిజీపీని కోరుతున్నానని అయన అన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:DGP’s words are for statements: MLA Rajasinghe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page