నాగబాబు… అప్ డేట్ అవ్వండి

0 12

హైదరాబాద్ ముచ్చట్లు:

 

మెగా బ్రదర్నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నాగబాబుపై జరిగే ట్రోలింగ్, దానికి ఆయన ఇచ్చే కౌంటర్లు ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంటాయి. ఈ మధ్య నాగబాబు సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటున్నారు. కానీ గత ఏడాది మాత్రం నాగబాబు పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. ప్రతీ విషయం మీద స్పందిస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కేంద్ర ప్రభుత్వం, గాంధీ, గాడ్సే, హిందు దేవుళ్లు, సంప్రదాయాలు, బాలకృష్ణ, ఆర్జీవీ ఇలా ఏ ఒక్క టాపిక్ కూడా వదల్లేదు.అలా నాగబాబు సోషల్ మీడియా ఎన్నో వివాదాలకు కారణమయ్యారు. ప్రస్తుతం నాగబాబు మాత్రం ఎందుకో గానీ సైలెంట్‌గానే ఉంటున్నారు. ఎక్కువ యాక్టివ్‌గా ఉండటం లేదు. మునుపటిలా స్పందించడం లేదు. ఇన్ స్టాలో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేయడం లేదు. అయితే తాజాగా నాగబాబు వేసిన ఓ ట్వీట్ మళ్లీ కాంట్రవర్సీకి తెరదీసింది.అసలే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తుందనే భయం అందరిలోనూ ఉంది. ఈ సందర్భంలో యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు అనుమతలు ఇచ్చారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 

 

 

- Advertisement -

అయితే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కన్వర్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది.ఈ విషయం తెలియని నాగబాబు కేంద్రానికి చురకలు అంటించారు. భారత ప్రభుత్వం ముందు రెండే దారులున్నాయని కన్వర్ యాత్రనైనా ఆపాలి.. లేదా థర్డ్ వేవ్ రాకుండా అయినా చూడాలి అని అన్నారు. ఇండియా థర్డ్ వేవ్ కోవిడ్ ని కంట్రోల్ చెయ్యగలుగుతుంది అని నమ్మకం ఉండేది.బట్ ఉత్తరాఖండ్ లో జరగబోతున్నకన్వర్ యాత్ర అనుమతి ఇవ్వటం వల్ల థర్డ్ వేవ్ ప్రమాదం తప్పేటట్లు లేదని అన్నారు.ఇక నాగబాబు వేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అప్డేట్ అవ్వండి సర్.. ఆ యాత్రను రద్దు చేశారు.. ఎప్పుడూ కూడా కేంద్రాన్ని విమర్శించడమేనా?, కేరళ, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎందుకు కేసులు పెరుగుతున్నాయో మీరు అడగరా?.. అది కూడా థర్డ్ వేవ్‌కు దారి తీస్తోంది కదా? అని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Nagababu … stay updated

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page