నాలుగు సంవత్సరాలుగా ప్రేమ  వ్యవహారం

0 45

ప్రియుడు శారీరకంగా వాడుకుని పెళ్లి కి నిరాకరించటంతో యువతి ఆత్మహత్య యత్నం

ఖమ్మం   ముచ్చట్లు:

- Advertisement -

మండలంలోని చిరునోముల గ్రామంలో మంగళవారం రాత్రి తన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని మనస్తాపంతో ప్రియురాలు శానిటైజర్‌ తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పారా సింధు రావినూతలకు చెందిన పర్సగాని వేణు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తనను శారీరకంగా లొంగదీసుకొని పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తున్నాడని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పది రోజుల కిందట వేణుపై సింధు ఫిర్యాదు చేసింది.తనకు న్యాయం చేయాలని ఇప్పటికే రెండు సార్లు ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేసింది. అయి నప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శానిటైజర్‌ తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సింధును కుటుంబ సభ్యులు రావినూతలలో ఉన్న ప్రియుడి ఇంటి ఎదుట వదిలేశారు.దళితురాలైనందున తనను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడి తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Love affair for four years

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page