పుంగనూరు ఆర్‌బికెలతో రైతులకు మహర్ధశ -అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 103

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మహర్ధశ పట్టిందని , రైతుల ముంగిటకు అన్ని రకాల సేవలు అందించడం జరుగుతోందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. బుధవారం మండలంలోని భీమగానిపల్లె, మోదుగులపల్లె గ్రామాల్లో రైతు భరోసా చైతన్యయాత్రలు ఏవో సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఆర్‌బికెల ద్వారా మెరుగైన సేవలు అందించి, ఆదర్శంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు, సలహాలు, సూచనలు తీసుకుని నాణ్యమైన పంటలు పండించాలని కోరారు. మార్కెటింగ్‌ సౌకర్యాలు, ఎరువులు, విత్తనాలు కూడ ఆర్‌బికెలలో సఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, సర్పంచ్‌లు శివమ్మ, సుబ్రమణ్యం, మోహన్‌, వెంకట్రమణ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Mahardhasa-Akkisani Bhaskarreddy for farmers with Punganur RBKs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page