పెద్దాయన సలహాతో రేవంత్ అడుగులు

0 29

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

సీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డికి మీడియా దన్నుగా నిలుస్తుంది. ఒకవర్గం మీడియా ఆయనను ఆకాశానికెత్తేలా ప్రచారం ప్రారంభించింది. గతంలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీకి లభించని ప్రచారం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే లభిస్తుండటం విశేషం. ఇది రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు. ఆయన వెనక ఉన్న నీడలదేనన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక వర్గం మీడియా కెమెరాల ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపైనే ఉంది.గతంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈరకమైన ప్రచారం మీడియాలో దక్కేది కాదు. ఆయన ఏడేళ్లు పార్టీ కోసం ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం దక్కలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఫేట్ మారినట్లుంది. తెలంగాణలో ఏ మీడియాలో చూసినా రేవంత్ రెడ్డి జపమే కన్పిస్తుంది. ఏపీలో జగన్ కు వ్యతిరేక మీడియా మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డికి మద్దతుగానే నిలుస్తున్నట్లు కన్పిస్తుంది.ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి ఆయన ఒక మీడియా అధిపతి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పత్రికాధిపతి రేవంత్ కు కీలక సలహాదారుగా మారినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అక్కడి నుంచే వస్తున్నాయని, ఆ స్క్రిప్ట్ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారన్న టాక్ కాంగ్రెస్ లో బలంగా విన్పిస్తుంది.సోషల్ మీడియాలో కూడా రేవంత రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియా టీం ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఇమేజ్ కు తగినట్లుగానే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలన్నది ఆ మీడియా లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకే రేవంత్ తుమ్మినా, దగ్గినా పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ కు చాలా కాలం తర్వాత తెలంగాణలో మీడియా దన్ను దక్కింది.

 

 

 

- Advertisement -

మళ్లీ కాంగ్రెస్ గూటికి కొండా

తెలంగాణ గ‌డ్డ‌మీద ఇప్పుడు రాజ‌కీయాలు అత్యంత వేగంగా అన్ని పార్టీల‌ను కుదిపేస్తున్నాయ‌నే చెప్పాలి. అనూహ్యంగా ప్ర‌తి పార్టీలో కూడా కొన్ని మార్పులు జ‌రుగుతున్నాయి. ఇవి ఏకంగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను కూడా శాసించే స్థాయిలో జ‌రుగుతున్నాయి. దీంతో ఏ పార్టీని కూడా బ‌ల‌మైన పార్టీగా అనుకోవ‌డానికి లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ రాక‌తో అన్ని పార్టీల్లో కూడా క‌ల‌వ‌రం మొద‌లైంది. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారంతా మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికే వ‌స్తున్నారు.కాక‌పోతే రేవంత్‌రెడ్డి ప్ర‌భావం కొంద‌రిని పార్టీకి రాజీనామా చేయిస్తే… మ‌రి కొంద‌రిని చేయి క‌లిపేలా చేస్తోంది. ఇదే క్ర‌మంలో నిన్న కౌశిక్‌రెడ్డి కూడా రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కానీ రేవంత్ మాత్రం ఇలాంటివేమీ ప‌ట్టించుకోకుండా అంద‌ర్నీ మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇక ఈ నేప‌థ్యంలోనే ఈరోజు చేవెళ్ల మాజీ ఎంపీ అయిన కీల‌క నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. గ‌త కొంత కాలంగా కొండా బీజేపీలో చేరుతారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టికెట్ రాక‌పోవ‌డంతో టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కానీ మొన్న జ‌రిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక త‌ర్వాత ఆయ‌న హ‌స్తానికి కూడా హ్యాండ్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి ఏ పార్టీలో చేర‌లేదు. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం ఆయ‌న్ను మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ఆయ‌న చ‌ర్చ‌లు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Rewanth feet with adult advice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page