ప్రతి నెల 5 వేల కోట్ల అప్పు

0 24

విజయవాడ   ముచ్చట్లు:
సంక్షేమ పథకాల అమలు, ఇతర ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.5వేల కోట్ల అప్పు చేస్తోందనిఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తమకున్న పరిమితి మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రం అప్పులు చేస్తున్న విధంగానే తామూ చేస్తున్నామని పేర్కొన్నారు. అప్పుతో సేకరించిన నిధులను ప్రజా సంక్షేమ పథకాల కింద పేదలకే ఇస్తున్నామన్నారు.ప్రతినెలా సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లు, వడ్డీ-అసలు చెల్లింపులకు రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన అనేక రకాల నిధులూ సరిపోవడం లేదని… ఫలితంగా ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు రుణంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని బుగ్గన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ రుణం డిసెంబరు వరకు ఇక పరిమితి రూ.3,000 కోట్ల వరకే ఉందన్నారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,100 కోట్ల మేర గ్యారంటీల ఆధారంగా అప్పులూ తీసుకున్నామని తెలిపారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం పరిమితి రూ.1,06,200 కోట్లకు మించకూడదు. ఇప్పటికే ఆ మేరకు ప్రభుత్వం గ్యారంటీలు కల్పించింది. దీంతో ఆ రూపేణా రుణం పొందే మార్గాలు సన్నగిల్లాయి. దీంతో రిజర్వు బ్యాంకు కోత పెట్టిన రుణ పరిమితి నుంచి మినహాయింపు పొందే ప్రయత్నాలు, అందుకు అవసరమైన వాదన ఆర్థికశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

- Advertisement -

Tags:Debt of Rs 5,000 crore every month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page