మరోసారి సీపీఐ భూపోరాటం

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేటికరణ చేస్తుంది. పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. గ్యాస్  ధర లపై మహిళలు నిరసన చేస్తూ ట్యాంక్ బండ్ లో సిలిండర్ విసిరేస్తే కేసులు పెట్టడం కక్ష ధోరణి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  అరోపించారు.ప్రాథమిక హక్కులను కాలరాస్తుంది..వెంటనే కేసులు ఉపసమహరించుకోవాలి. మంత్రి వర్గ సమావేశం లో ఖాళీల పై చర్చ జరుగుతోంది.. ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలి. పీఆర్సీ కమిటీ లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పింది. భూముల ధరలనురిజిస్ట్రేషన్ ధరలను పెంచుతున్నారు. కాంటాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను  రెగ్యూరైజ్ ఎప్పుడు చేస్తారు. కరోన సమయంలో విధుల్లో చేరిన 1640 మంది నర్సులు కరోన కష్టకాలంలో పని చేసారు. వారిని రాత్రి కి రాత్రే ఉద్యోగాల నుండి తొలగించారని అన్నారు.నిరసన తెలిపితే పోలీసులు వారిపై దాడి చేస్తున్నారు. తక్షణమే జీవో 13 ను ఉపసంహరించుకోవాలి. భూముల అమ్మకాలను ఆపివేసి అవసరాల కోసం ఉపయోగించాలి. మరోసారి భూపోరాటం చేయాలని సీపీఐ నిర్ణయించింది. 15 న రాష్ట్ర వ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ కి పిలునిస్తున్నాం. ధరణి వెబ్సైట్ ద్వారా నష్టాలు ఉన్నాయి అందులో ఉన్న తప్పులను తొలగించాలని అయన అన్నారు.

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Once again the CPI land struggle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page