మహిళ ఆత్మహత్యాయత్నం

0 16

నాగర్ కర్నూలు  ముచ్చట్లు:
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది.తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుండి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది.భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది.ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిపోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని హత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది  కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. సెక్యూరిటీ సిబ్బంది బాటిల్ ను  బలవంతంగా తీసుకున్నాడు. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన సమస్యను జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  అడిగి తెలుసుకున్నారు.  సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి సంఘటనలు పాల్పడవద్దని నచ్చజెప్పారు. .

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Woman attempted suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page