మావోయిస్టులకు ఎదురుదెబ్బ

0 18

మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్నలొంగుబాటు
రంజిత్‌పై ఉన్న రివార్డు చెక్కు(రూ. 4 ల‌క్ష‌లు)ను అందజేసిన  డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి
హైదరాబాద్‌  ముచ్చట్లు:

రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్‌ రావుల శ్రీనివాస్‌ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి  సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్‌ దండకారణ్యం బెటాలియన్‌ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా రావుల రంజిత్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు.” మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో  చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్‌ అయి 2019 వరకు మెంబర్‌గా వ్యవహరించాడు. 2019లో తండ్రి రామ‌న్న తీవ్ర అనారోగ్యానికి గురై గుండెపోటుతో చ‌నిపోయాడు. బ‌య‌ట‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేపిద్దామ‌ని చెప్పినా కూడా పార్టీ రంజిత్ వాద‌న‌ను వినిపించుకోలేదు. ఇక తండ్రి మ‌ర‌ణానంత‌రం రంజిత్‌కు పార్టీలో వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ క్ర‌మంలో మావోయిస్టు కార్య‌క్ర‌మాల‌పై విర‌క్తి చెందిన రంజిత్ లొంగుబాటుకు అనుమ‌తి అడిగాడు. కానీ మావోయిస్టు పార్టీ తిర‌స్క‌రించింది. దీంతో దండ‌కార‌ణ్యంలో పార్టీలో చురుకుగా పాల్గొంటున్న త‌న త‌ల్లి సావిత్రి వ‌ద్ద‌కు రంజిత్ వెళ్లి త‌న లొంగుబాటు విష‌యాన్ని చెప్పాడు. మొత్తానికి త‌ల్లి అనుమ‌తితో రంజిత్ లొంగిపోయాడు. మావోయిస్టు భావ‌జాలంతో ప్ర‌స్తుతం ఎలాంటి ఉప‌యోగం లేద‌ని రంజిత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్‌ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018  కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్‌తో పాట 2020 మినప అటాక్లో సైతం రంజిత్‌ చురుగ్గా వ్యవహరించాడు.కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ కోరారు.రంజిత్‌పై ఉన్న రివార్డు చెక్కు(రూ. 4 ల‌క్ష‌లు)ను అత‌నికి డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అంద‌జేశారు. త‌క్ష‌ణ అవ‌స‌రాల నిమిత్తం రూ. 5 వేల న‌గ‌దును కూడా అంద‌జేశారు..

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:A setback for the Maoists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page