ముంపులో తూర్పు మన్యం

0 15

రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని లోతట్టు గిరిజన గ్రామాల ప్రజలు ముంపు భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎగువన వర్షాలు కురవడం, గోదావరిలోకి నీరు చేరడం, కాఫర్‌డ్యామ్‌ కారణంగా బ్యాక్‌వాటర్‌ పెరగడంతో వారిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కాఫర్‌డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ కారణంగా దేవీపట్నం మండలంలో ఇప్పటికే 17 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. విఆర్‌పురం, కూనవరం మండలాల్లో పూర్తిస్థాయిలో పునరావాసం, పరిహారం అందకపోవడం, ఊరు ఖాళీ చేస్తే నష్టపోతామని నిర్వాసితులు అక్కడే ఉండిపోయారు.గతంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చిన తరువాత ముందుగా దేవీపట్నం మండలంలో 32 వరకు గ్రామాలు ముంపునకు గురయ్యేవి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 8 అడుగుల నీటిమట్టం నమోదుకే దేవీపట్నంలో పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు, మంటూరు, దేవీపట్నం, కచ్చులూరులో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇక భద్రాచలం వద్ద 43 అడుగులు వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాలు 44 ఉన్నాయి. 5,168 బాధిత కుటుంబాలు ఉన్నాయి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఫలాలను కేవలం 3,055 కుటుంబాలు పొందాయి. మరో 2,563 కుటుంబాలకు ప్యాకేజీ అందాల్సి ఉంది. ఇప్పటికి 17 గ్రామాలు మాత్రమే ఖాళీ చేశారు. కూనవరం మండలంలో కూనవరం, శబరి, కట్టుగూడెం, కొండ్రాజుపేట, తాళ్లగూడెం, గుందువారిగూడెం, రాయిగూడెం, విఆర్‌పురం మండలంలో శ్రీరామగిరి, సీతంపేట, భైరవపట్నం, జీడిగుప్ప గ్రామాలనూ గోదావరి నీరు తాకింది. ప్యాకేజీ అందని కుటుంబాలన్నీ ముంపు గ్రామాల్లోనే ఉన్నాయి.ప్రస్తుతం వరదలను దృష్టిలో పెట్టుకుని శంఖవరం, పోతవరం, దామనపల్లి, ముసురుగుంట ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలల్లో తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. దేవీపట్నంలో 17 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. మరో 27 గ్రామాలకు కల్పించాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి ముసునుగుంట, పెదభీంపల్లి-3, నేలగోనెలపాడులో కాలనీలు పూర్తికానున్నాయి. మిగిలిన కాలనీలను సకాలంలో పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.మా గ్రామంలో 52 కుటుంబాలు ఉన్నాయి. గోదావరికి వరద రాకముందే గ్రామాన్ని నీరు చుట్టుముట్టింది. వారం రోజులుగా విద్యుత్‌ లేదు. దోమలు, పాములతో ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఎవరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదు. ఇటీవల స్పెషల్‌ ఆఫీసర్‌ వచ్చి పోతవరం హాస్టల్‌లో తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని చెప్పారు. శాశ్వత పునరావాసం, పరిహారం కల్పించాలి.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

- Advertisement -

Tags:East Manyam in Mumpu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page