మెదక్ నుంచి మళ్లీ రాములమ్మ

0 19

మెదక్ ముచ్చట్లు:

 

తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకురాలుగా ఉన్న రాములమ్మ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారా? ఉండరా? అనే ప్రశ్నలు ఆమె అభిమానుల మదిలో ఉన్నాయి. తెలుగు సినిమాల్లో హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన విజయశాంతి, 1998లో బిజెపి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే తన పార్టీ పూర్తిగా బలోపేతం కాకపోవడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.2009 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా కేసిఆర్‌తో కలిసి విజయశాంతి లోక్ సభలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడారో అందరికీ తెలిసిందే. అలా పోరాటం చేసిన విజయశాంతి అనూహ్య పరిణామాల మధ్య టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 2013లో టిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన విజయశాంతి 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయశాంతి భారీ మెజార్టీతో ఓటమి పాలయ్యారు.
ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం అధికార టీఆర్ఎస్ పై పోరాటం చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీలో పని చేశారు డైరెక్టుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

 

 

 

 

- Advertisement -

మళ్లీ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం కావడం, అటు బిజెపి రోజురోజుకి పుంజుకోవడంతో విజయశాంతి రాజకీయాలు మలుపు తిరిగాయి.ఊహించని విధంగా కాంగ్రెస్‌ను వీడి విజయశాంతి మళ్లీ బీజేపీలో చేరారు. బిజెపిలో విజయశాంతి కీలకంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏదో ఒక అంశంపై టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇలా నిత్యం టిఆర్ఎస్ తో పోరాటం చేస్తున్న విజయశాంతి నెక్స్ట్ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది తెలియకుండా ఉంది.ఇటీవల దుబ్బాక ఎన్ని ఉపఎన్నికల్లో విజయశాంతి బరిలో ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆమె పోటీ చేయలేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. అయితే విజయశాంతి లాంటి నాయకులని బరిలో దించాలని బిజెపి భావిస్తుంది. మళ్ళీ ఆమెని మెదక్ పార్లమెంటు బరిలోనే దింపే అవకాశం ఉంది. లేనిపక్షంలో మెదక్ అసెంబ్లీ లో పోటీ చేయించే ఛాన్స్ ఉంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో రాములమ్మ ఎక్కడ నుంచి బరిలో ఉంటారో.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Ramulamma again from Medak

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page