రసాభాసగా జడ్పీ సమావేశం

0 19

సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. విపక్ష పార్టీలకు చెందిన పలువురు జడ్పీటీసీలు లేవనెత్తిన ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో విపక్ష అధికార పార్టీ సభ్యుల మధ్య వివాదం రాజుకుంది. అధికార పార్టీ నేతల తీరుపై విపక్ష పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తాము మాట్లాడుతుంటే… ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వారికి అధికార పార్టీ నేతలు సహకరించడం వల్లే ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికార పార్టీల మధ్య ఘర్షణ కవర్ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పై అధికార పార్టీ నేతలు దురుసుగా ప్రవర్తించడం మరింత వివాదానికి కారణమైంది.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

- Advertisement -

Tags:Jupiter meeting juicy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page