రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 22

– పండ్లతోటలపై రైతులకు అవగాహన కల్పించండి
– పురోగతి లేకుంటే కఠిన చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

 

- Advertisement -

గ్రామీణ ప్రాంతంనుంచి పట్టణాలకు, లింకు రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం పై దృ ష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిసిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలమేరకు రోడ్డులు, ప్రభుత్వ స్థలాల్లో చెట్ల పెంపకం పనులు చేపట్టాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ భాద్యత సర్పంచ్‌లదే నని తెలిపారు.అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 13 రకాల పండ్ల తోటలతోపాటు మల్లెపూలు, రోజా మొక్కలు పెంచుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించిదన్నారు. ఈ విషయాలను సిబ్బంది వలంటీర్ల ద్వారా ప్రజలకు , రైతులకు తెలియజేసి అర్హులకు లబ్దిచేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి గ్రామంలోనూ చెరువుల అభివృద్దిపనులతోపాటు, సఫ్లె, ఫీడర్‌ ఛానల్స్ పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. ఉపాధిహామీ ద్వారా జాబ్‌ కార్డు కల్గిన ప్రతి కుటుంభానికి వంద రోజులు పనులు కల్పించి ఆర్థికంగా చేయూతనివ్వాలన్నారు. హౌసింగ్‌ మంజూరైన లబ్దిదారులకు సకాలంలో వారికి ఉపాధి నిధుల ద్వారా 90 పని దినాలు కల్పించి వెంటనే బిల్లులు చెల్లించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామపంచాయతీలో జరిగే ప్రతి అభివృద్ది కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు.ఉన్నతాధికారులు కేటాయించిన లక్ష్యాలను అధిగమించడంలో నిర్లక్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పిటీసీ దామోదారరాజు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, ఎంపీడీఓ శంకరయ్య, ఏపిఓ శ్రీనివాసుల యాదవ్‌, ఏఈ పురుషోత్తం తదితరులున్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: The focus should be on the cultivation of vehicles on both sides of the roads

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page