వారం రోజుల్లోనే ఆయనకు నోటీసు రావొచ్చు

0 27

-290 పేజీల డాక్యుమెంట్ తో ఫిర్యాదు
-ఎంపీ, వైయస్సార్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్

 

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

 

- Advertisement -

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వారం రోజుల్లోపే స్పీకర్ నోటీసును ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్ రామ్ తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో కూడిన డాక్యుమెంట్‌ను తమ పార్టీ పక్షాన స్పీకర్‌కు అందించడం జరిగిందని తెలిపారు.
ఎప్పుడయితే పార్టీ విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారో అప్పుడే ఆయన పదవికి డిస్క్వాలిఫై అయినట్లేనని అన్నారు.  తాము ఇచ్చిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని స్పీకర్ ఆయనకు మరో వారం రోజుల్లోపే నోటీసు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అనంతరం స్పీకర్‌కు ఉన్న విశేష అధికారాన్ని ఉపయోగించి ఆయన ఎంపీ పదవిని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: He may get notice within a week

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page