వాళ్లకి నామినేటెడ్ పోస్టులు

0 19

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు సర్వం సిద్ధమైంది. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో  విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.  60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్ల ప్రకటనకు అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఉందనున్నట్లు తెలుస్తోంది.విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయ నిర్మల అని .. రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అని.. అలాగే.. నెడ్ క్యాప్ చైర్మన్ గా ప్రతి పాదనలో కేకే రాజు ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ అని.. విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ?! అని సమాచారం. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జీవి అని ప్రచారం జరుగుతుండగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడును నియమించనున్నారు. డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి అని.. రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్‌ అని సమాచారం. డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపునకు అవకాశం ఉండగా.. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా గుంటూరు జిల్లాకు చెందిన నేతకు ఛాన్స్ ఇక్కే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Nominated posts for them

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page