వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిలింగ్

0 13

విశాఖపట్నం ముచ్చట్లు:

 

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిలింగ్ ప్లాన్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. భూములు అమ్మని వారివి, ప్రత్యర్ధులు భూములను రెడ్ జోన్లో పెట్టారని అన్నారు.విశాఖలో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయాలని..లోపాలు మీద న్యాయ స్థానంకు వెళతామని చెప్పారు. మాస్టర్ ప్లానింగ్ అంతా విజయసాయి రెడ్డే చేశారని వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులను బయపెట్టాడానికి మాస్టర్ ప్లాన్ వేశారని మండిపడ్డారు. మాస్టర్ ప్లానింగ్ పేరుతో కోట్లాది రూపాయల దండుకుంటున్నారని ఆరోపించారు. రెడ్ జోన్, గ్రీన్ జోన్ అంటూ  బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారని.. బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత.. వీటి మీద విచారణ ఉంటుందని బండారు సత్యనారాయణ తెలిపారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: Blackmail throughout the VMRDA master plan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page