సుదీర్గ మంత్రి వర్గ సమావేశంలో నిరుద్యోగ సమస్యపై చర్చ లేదు

0 22

–    ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

 

హైదరాబాద్  ముచ్చట్లు:

 

- Advertisement -

ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనంత సేపు నిన్న,నేడు తెలంగాణలో మంత్రి వర్గ సమావేశం జరిగింది కాని నిరుద్యోగ సమస్యపై చర్చ జరగక పోవడం శోచనీయమని     ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్ అన్నారు బుధవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, మండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటూ ప్రగల్బాలు పలికారని,ఇలా ఇస్తే ఇప్పటి వరకు 2.5 లక్షల ఉద్యోగాలు రావాలి కాని,7 ఏళ్ల కాలంలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంత ఘోరంగా ఎక్కడ లేదన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇష్టం అంటే 3016 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు.ఎందుకు ఇవ్వలేదు. నిరుద్యోగులరా టిఆర్ఎస్ నాయకుల గల్లా పట్టుకొని అడగాలాని పిలుపు నిచ్చారు.ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రణాళికలు లేవని,ఉద్యోగ కాలెండర్ ప్రకటించాలని మొదటి నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు.4, 91 లక్షల వేలు ఉండాల్సి ఉండగా 2 లక్షల మంది ఖాళీగా ఉన్నారు. ఇన్ని ఖాళీలు ఉన్న ఎందుకు నింపడం లేదు.1.12 లక్షల ఉద్యోగాలు 2014 లో ఖాళీ ఉన్నాయి. బిస్వాల్ కమిటి 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని చెప్పారు. జిల్లాల సంఖ్య 33 జిల్లాలకు పెంచిన కూడా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు.1.91 లక్షల పోస్ట్ లు ఖాళీలు ఉంటే 50 వేల పోస్టులు నింపుతామని ఎందుకు అంటున్నారు.ఒకవైపు ఉద్యోగుల మీద పని భారం.. మరోవైపు ఖాళీలు.. ఎందుకు ఉన్నాయని దాసోజు ప్రశ్నించారు.2018, ఆగస్టు 30న,  124 జి.ఓ ఇచినపుడే 36 నెలల్లో అన్ని ఖాళీలు పూర్తి చేయాలని ఇచ్చారు.ఇంతవరకు ఎందుకు నింపలేదో యువకులు టిఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు.24, మార్చ్ నాడు సి.ఎస్ మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చాడు ఖాళీల వివరాలు ఇవ్వమని అడిగారు. ఎంది ఇది..2018 నుంచి ఖాళీలు వివరాలు ఇవ్వకుండా అధికారులు ఎం చేశారు.క్లియర్ గా ఖాళీ ఉన్న పోస్ట్ లను ఎందుకు నింపడం లేదు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 

 

 

 

అయిన పాలకులకు కనికరం లేదన్నారు.ఖాళీగా ఉన్న విద్య సంస్థలలో పేద విద్యార్థులు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.విద్య సంస్థలలో వచ్చిన తెలంగాణ ఉద్యమంతోనే కదా ఇవ్వాళ తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా.. వాళ్లపై ఎందుకు ప్రేమ లేదు.తెలంగాణ లో 40 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి కథ ఇది.. ఇప్పటికైనా ఉద్యోగాల ఖాళీ లతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మోసం చేస్తున్నారు.టీఎస్ ఇపాస్ లో కూడా ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ మోసం చేస్తున్నారు. మీ ప్రభుత్వం, మీ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 90,486 వేలు దరఖాస్తులు చేశారు. అన్ని  11, 93094 వేలు కోట్లు.. పెట్టుబడి వచ్చింది. కేటీఆర్ 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.. కానీ6 లక్షల 99 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఇంత అబద్దమా.. ఇంత మోసమా..ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 50 శాతం లోకల్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.బి.సి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన లోన్లు ఏడేళ్ళల్లో 837 కోట్లు కేటాయించి 467 మంజూరు చేసి 200 కోట్లు ఖర్చు చేశారు.3.32 లక్షల మంది దరఖాస్తు కి 35 వేల మందికి ఇచ్చారు.దళిత క్రాంతి కింద ఎస్సి కార్పొరేషన్ కింద 9.15 లక్షల దరఖాస్తు చేసుకుంటే 1.5 లక్షల మందికి లోన్లు ఇచ్చారు. ఎం.బి.సి కింద ఘోరమా అని దాసోజు ఆవేదన వ్యక్తం చేసారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags: The issue of unemployment was not discussed at the lengthy ministerial meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page