సుప్రీంలో ఏపీ సర్కార్ పిటీషన్

0 16

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కృష్ణా జలాలు, నీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీకి, జల్ శక్తి మంత్రికి లేఖలు రాశారు. అలాగే నదీ జలాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు. నదీ జలాల విషయంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తోందని, కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని, దీనివల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోదీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ తీరు వల్ల కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా సాగునీటి ప్రాజెక్ట్‌లను సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పరిధిలోకి తీసుకురావాలని జగన్ కోరారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా కేంద్ర జలశక్తి శాఖకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags:AP Sarkar Petition in the Supreme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page