అతి పురాతన జైన్  టెంపుల్ ను పరిశీలించిన పురావస్తు శాఖ ఏడీ రజిత

0 23

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా, కంబదూరు మండల కేంద్రంలో ప్రాచీన కాలంలో నిర్మితమైన అక్కమ్మ  జైన్ టెంపుల్  అభివృద్ధికి  నోచుకోవడం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో, స్పందించిన అనంతపురం జిల్లా పురావస్తు శాఖ ఏడీ రజిత ,స్థానిక సర్పంచ్ పద్మ తిమ్మప్ప మరియు మండల అధికారులతో కలిసి ప్రాచీన అక్కమ్మ జైన్ టెంపుల్ స్థితి గతులను పరిశీలించారు.
అనంతరం పురావస్తు శాఖ ఏడీ రజిత మీడియాతో మాట్లాడుతూ 6 వ శతాబ్దం లో జైన్ మతం ప్రారంభం అయింది అని,అలాగే కంబదూరు ప్రాంతాన్ని చాళుక్యులు, పల్లవులు, విజయనగర రాజులు పరిపాలించారు. అక్కడ ఉన్నటువంటి శివలింగాలు, అక్కమ్మ దేవాలయం, జైన్ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలుగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించిన భూమిని గతంలో కొంతమంది వ్యక్తులు  రెవెన్యూ  రికార్డుల్లో నమోదు చేసుకున్నారనీ , వాటికి సంబంధించిన వివరాలను సర్వే ద్వారా వెలికితీసీ , ఆలయానికి ప్రత్యేక రస్తా, కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ఈశ్వరయ్య శెట్టినీ కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఈశ్వరయ్య శెట్టి, ఎంపిడిఓ శివారెడ్డి, స్థానిక నాయకులు నీలి శంకరప్ప, యువ నాయకులు గంగాధర,  మంజు, వీరేంద్ర స్వామి,  చెన్నకేశవవులు , తదితర ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

 

Tags: Archaeological Survey of India Adi Rajita examines the oldest Jain temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page