ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ

0 12

సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలి
-సచివాలయ సేవల గురించి ఇంటింటికి తెలియజేయాలి
సచివాలయ సిబ్బందికి ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్

కర్నూలు ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు.
గురువారం మధ్యాహ్నం పాణ్యం నియోజకవర్గం, పాణ్యం మండలం, బలపనూరు గ్రామ సచివాలయం, పాణ్యం గ్రామ సచివాలయం మరియు 1, 2 లను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను పరిశీలించి ఎవరైనా రోగులు సచివాలయానికి వస్తే వారికి ఎక్కడ రెఫర్ చేస్తున్నారు… ఎవరితో మాట్లాడుతున్నారు.ఇప్పటివరకు ఎంతమందికి రేఫర్ చేశారు.వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను పరిశీలించారు. బలపనూరు గ్రామ సచివాలయం, పాణ్యం గ్రామ సచివాలయం 1, 2 పరిధిలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు. ఫ్రెంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు. ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా అద్వానంగా జరుగుతుందని, అందరిని మోటివేషన్ చేసి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఏ ఎన్ ఎంలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నో మాస్క్- నో ఎంట్రీ బోర్డు సరిగా కనపడటం లేదని పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసి సచివాలయంకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గ్రామాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన నేస్తం పథకాలకు సంబంధించి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేశారా వంటి వివరాలు అడిగి నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. . ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించిచారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు.జిల్లా కలెక్టర్  వెంట పాణ్యం తహసీల్దార్ రత్న రాధిక, ఎంపీడీఓ దస్తగిరి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Suddenly check the village secretariats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page