ఆన్ లైన్ గేమ్ కు ఎడిట్ అయి…చివరకు

0 11

నల్గొండ ముచ్చట్లు:

మొబైల్‌ ఫోన్లలో ఆడే ఆన్‌లైన్ ఆటల సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బాగా బానిస అయిన యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో బుధవారం అతను చనిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని ఏపూరు గ్రామానికి చెందిన కాకి వెంకటరెడ్డి, కవితలకు కొడుకు, కూతురు ఉన్నారు. ఏడాది క్రితమే కుమార్తె వివాహం చేయగా కుమారుడు మధురెడ్డి (20) బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.కరోనా వేళ ఇంటివద్దనే ఉండడంతో అతను సెల్ ఫోన్లలో గేమ్స్‌కు బాగా అలవాటు పడ్డాడు. ఇంటివద్దనే ఉంటున్న మధురెడ్డి ఆన్‌లైన్‌ గేమ్‌ మోజులో పడి డబ్బులు పెట్టి బెట్టింగ్‌లకు దిగసాగాడు. ఇటీవల తల్లి కవిత ఖాతానుంచి రూ.1.20 లక్షలు డెబిట్ కావడంతో ఆమె ఆందోళన చెందింది. ఆ వివరాలు తెలుసుకోవడానికి స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. దీంతో కొడుకు భయపడిపోయాడు.డబ్బు కట్ అయిన విషయం బయటపడుతుందని భయాందోళనకు గురైన మధురెడ్డి ఇంట్లో తల్లి చీరతో ఉరేసుకున్నాడు. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు..

 

- Advertisement -

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Edit the online game … finally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page